Friday, 6 November 2015

సమీక్ష : త్రిపుర – సినిమా స్లో అయ్యింది హర్రర్ మిసయ్యింది.



విడుదల తేది : 06 నవంబర్ 2015
వారధి.కామ్ (waaradhi.com)- 2.5/5
దర్శకత్వం : రాజ్ కిరణ్
నిర్మాత : ఎ. చినబాబు – ఎం. రాజశేఖర్
సంగీతం : కమ్రాన్
నటీనటులు : స్వాతి, నవీన్ చంద్ర, పూజ రామచంద్రన్..
‘గీతాంజలి’ లాంటి సక్సెస్ ఫుల్ హార్రర్ కామెడీతో అరంగేట్రం చేసిన దర్శకుడు రాజ్ కిరణ్. ఇప్పుడు కాస్త రూటు మార్చి.. ‘త్రిపుర’ అనే హార్రర్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కోన వెంకట్ స్క్రీన్ ప్లే సహకారం అందించడం.. స్వాతి లాంటి టాలెంటెడ్ యాక్ట్రెస్ ప్రధాన పాత్ర పోషించడం.. ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో సినిమా మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి ‘త్రిపుర’ ఆ అంచనాల్ని అందుకుందో లేదో చూద్దాం పదండి.
కథ :
హైదరాబాద్ సిటీ అవుట్ స్కర్ట్స్ లోని ఓ ఫాం హౌస్ లో ఈశ(పూజ రామచంద్రన్)ని చంపేసి ఆ శవాన్ని మాయం చేస్తారు. అక్కడి నుంచి కట్ చేస్తే వరాహపట్నం అనే ఓ పల్లెటూరిలో ఈ సినిమా మొదలవుతుంది. త్రిపుర(స్వాతి) అమాయకత్వం, అల్లరి కలగలిపిన అమ్మాయి. చిన్నప్పటి నుంచీ త్రిపురకి తన చుట్టూ ప్రక్కల జరగబోయే కొన్ని ఇన్సిడెంట్స్ గురించి కలలు వస్తుంటాయి. అవి అలానే రియల్ లైఫ్ లో నిజం అవుతుంటాయి. అలాంటి త్రిపురకి ట్రీట్ మెంట్ ఇప్పించడం కోసం హైదరాబాద్ కి తీసుకెళ్తారు. అక్కడ తనని ట్రీట్ చేస్తున్న డాక్టర్ నవీన్ చంద్ర(నవీన్ చంద్ర) – త్రిపురలు ప్రేమలో పడి, పెళ్లి కూడా చేసుకుంటారు.
మొదట్లో త్రిపుర డ్రీమ్స్ గురించి నమ్మని నవీన్ ఒక రెండు ఇన్సిడెంట్స్ తర్వాత నమ్మడం మొదలు పెడతాడు. దానికి కారణం త్రిపుర నవీన్ చంద్రనే పొడిచినట్టు కల రావడం. ఇదిలా ఉండగా ఒకప్పుడు నవీన్ చంద్ర – ఈశ కలిసి పనిచేసిన డాక్టర్స్. కొద్ది రోజుల నుంచి ఈశ కనపడకపోవడంతో దాంతో ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ తిలక్ వస్తాడు. తిలక్ మొదటి నుంచి నవీన్ చంద్రని అనుమానిస్తుంటాడు. ఈశ కేసు వల్ల, త్రిపుర కలల వల్ల నవీన్ చంద్ర లైఫ్ పలు ఇబ్బందుల్లో పడుతుంది. ఆ ఇబ్బందుల నుంచి నవీన్ చంద్ర ఎలా భయటపడ్డాడు.? అసలు ఈశని నవీన్ చంద్రనే చంపాడా.? లేక వేరే ఎవరన్నా చంపారా.? అలాగే త్రిపుర కలగనట్టు తన చేతులతోనే నవీన్ ని పోడిచేసిందా.? అనే అంశాలను మీరు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే..
ప్లస్ :
ఈ సినిమాకి బాగా హెల్ప్ అయిన ప్లస్ పాయింట్.. హర్రర్ కామెడీ కథాంశానికి ఓ మంచి థ్రిల్లింగ్ పాయింట్ ని జతచేయడమే.. హైలైట్ అని ఎందుకు అన్నాను అంటే సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. కానీ చివర్లో వచ్చే ట్విస్ట్ మాత్రం థ్రిల్లింగ్ గా ఉంటుంది. అందుకే చివర్లో వచ్చే 15 నిమిషాలు సినిమాకి హైలైట్ అయ్యింది. ఇకపోతే సినిమాకి మొదటి 20 నిమిషాలు బాగుంటుంది. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ లో ఇచ్చే ట్విస్ట్ ఎపిసోడ్ బాగుంది. దానితో పాటు సినిమా మధ్య మధ్యలో వచ్చే కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ సినిమాకి బాగానే హెల్ప్ అవుతాయి.
నటీనటుల్లో ఈ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది ముగ్గురు.. వాళ్ళే స్వాతి, నవీన్ చంద్ర మరియు పూజ రామచంద్రన్. టైటిల్ రోల్ పోషించిన స్వాతి త్రిపుర అనే పాత్రకి పూర్తి న్యాయం చేసింది. మొదట్లో అమాయకత్వం, అల్లరి చేసే అమ్మాయిలా కనిపిస్తూ మెప్పిస్తే, తర్వాత తన కలల ద్వారా భయపడే హావభావాలను చాలా బాగా పలికించింది. ఇక చివర్లో స్వాతి చేసిన దెయ్యం సీన్ లో మాత్రం సూపర్బ్ గా చేసింది. నవీన్ చంద్ర మెయిన్ లీడ్ లో స్వాతికి పర్ఫెక్ట్ సపోర్ట్ ని ఇస్తూ సినిమాని నడిపించాడు. తనకి ఇబ్బందులు వస్తున్నప్పుడు తను చేసిన నటనే సినిమాకి హెల్ప్ అయ్యింది. చిన్న పాత్ర చేసినా పూజ రామచంద్రన్ మాత్రం చాలా బాగా చేసింది. క్లైమాక్స్ లో స్వాతి – పూజ కాంబినేషన్ సీన్ సూపర్బ్. శకలక శంకర్ – సప్తగిరి – జయప్రకాశ్ రెడ్డిలు సెకండాఫ్ లో కాస్త నవ్వించారు. ఇది కాకుండా ఫస్ట్ హాఫ్ లో సప్తగిరి అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసాడు. సినిమా మొదట్లో పెళ్లి కొడుకులా ధనరాజ్ కాసేపు నవ్వించి వెళ్ళిపోయాడు. రావు రమేష్, శ్రీమాన్ తదితర నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించి వెళ్ళిపోయారు.
మైనస్ :
త్రిపుర అనే సినిమాకి మొదటి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ నెరేషన్.. ఎందుకంటే సినిమా నెరేషన్ మొదటి నుంచి చివరి దాకా చాలా స్లోగా వెళ్తుంది. ఎక్కడా ఆడియన్స్ కి సినిమా వేగంగా వెళ్తున్న ఫీలింగ్ కలగదు. దానికి తోడు సినిమా రన్ టైం కూడా 151 నిమిషాలు ఉండడం వలన సినిమాని మరీ సాగదీస్తున్న ఫీలింగ్ వస్తుంది. నెరేషన్ తర్వాత కథనం గురించే చెప్పుకోవాలి. ఉన్న ఒక ట్విస్ట్ ని మొదట్లో రైజ్ చేయడం మరియు దానికి క్లైమాక్స్ లో రివీల్ చేయడం బాగానే ఉంది. కానీ సినిమా మొదలైన కొద్ది సేపటి నుంచీ చివర్లో ట్విస్ట్ రివీల్ చేసే దాకా నెక్స్ట్ ఏం జరుతుందా అనే సస్పెన్స్ ని క్రియేట్ చేయాలి కానీ అలాంటి ఆసక్తిని ఆడియన్స్ లో క్రియేట్ చేయలేకపోయింది కథనం.
ఇక నెగటివ్ పాయింట్స్ లో చెప్పుకోవాల్సింది మొదటి నుంచి బిల్డప్ ఇచ్చుకుంటా వచ్చిన జరగబోయేది ముందుగానే కలలు కాన్సెప్ట్ గురించి అస్సలు క్లారిటీ ఇవ్వలేదు. సినిమా మొత్తాన్ని దాని మీదే నడిపించి చివర్లో ఆ విషయం పై క్లారిటీ ఇవ్వకుండా సృష్టిలో సైన్స్ కి అందనివి కొన్ని ఉంటాయి అని ముగించేయడం అర్ధరహితంగా ఉంటుంది. ఇక చెప్పుకోవాల్సింది కామెడీ గురించి సినిమాలో మీరు బాగా నవ్వుకునే కామెడీ అంశాలు అస్సలు లేవు. సప్తగిరి చేలా సేపు కనిపించినా తన చేత చేయించిన కామెడీ రొటీన్ అనే పదానికే రొటీన్ అనిపించేలా ఉన్నాయి. అందుకే ఇందులో కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. వర్క్ అవుట్ అయిన ఒకే ఒక్క ఎపిసోడ్ కూడా ప్రేమకథా చిత్రమ్, రాజుగారి గది సినిమాల ఫార్మాట్ లోనే ఉంటుంది. ఇక సినిమాలో వచ్చే పాటలని సింపుల్ గా కట్ చేసేయవచ్చు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే డ్యూయెట్ అస్సలు అవసరం లేదు.
సాంకేతిక విభాగం :
కొత్త సంగీత దర్శకుడు కామ్రాన్ పర్వాలేదనిపించాడు. రెండు పాటలు బావున్నాయి. ఐతే సినిమాలో పాటలకు అంతగా ప్రాధాన్యం లేదు. నేపథ్య సంగీతం కన్సిస్టెన్సీ లేదు. హార్రర్ తో ముడిపడిన సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది కానీ మిగతా సన్నివేశాల్లో చాలా మొక్కుబడిగా ఉంది ఆర్.ఆర్. రవికుమార్ సానా ఛాయాగ్రహణం బాగుంది. హార్రర్ అనగానే అవసరం లేని అర్థం లేని షేకింగులతో ఇబ్బంది పెట్టకుండా అవసరానికి తగ్గట్లే కెమెరాను ఉపయోగించాడు. వెలిగొండ శ్రీనివాస్ తో కలిసి స్క్రీన్ ప్లే అందించిన కోన వెంకట్ తన మ్యాజిక్ చూపించలేకపోయాడు. డైలాగ్స్ మామూలుగా అనిపిస్తాయి. గుర్తుంచుకోదగ్గవేమీ లేదు. రాజ్ కిరణ్ దర్శకుడిగా తొలి సినిమా తరహాలో తన ముద్ర చూపించలేకపోయాడు. కొత్త పాయింట్ అనుకున్నపుడు దానిమీదే కథను నడపాల్సింది. మళ్లీ తన పాయింటు మీద తనకే కాన్ఫిడెన్స్ లేక రొటీన్ బాటలోకి వెళ్లిపోయినట్లుగా అనిపిస్తుంది.
తీర్పు :
టాలీవుడ్ లో సక్సెస్ మంత్రగా మారిన హర్రర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘త్రిపుర’లో థ్రిల్లింగ్ పరవాలేదు అనిపించిన, హర్రర్ అనేది మాత్రం ప్రేక్షకులను మెప్పించే విదంగా లేకపోవడం సినిమాకు మైనస్. సినిమా ప్రారంభం, ముగింపు బాగున్నప్పటికీ మిగతా అంతా బోరింగ్ గా, నెమ్మదిగా సాగడం, బలవంతంగా ఇరికించిన కామెడీ అనుకున్న స్థాయిలో వర్క్ అవుట్ కాకపోవడం వలన ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. సినిమాకి మెయిన్ లీడ్స్ అయిన స్వాతి, నవీన్ చంద్ర, పూజ రామచంద్రన్ ల పెర్ఫార్మన్స్ తో పాటు క్లైమాక్స్ లో వచ్చే థ్రిల్లింగ్ ఎపిసోడ్ ఆడియన్స్ ని థ్రిల్ చేయడమే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. మొత్తంగా చూస్తే సినిమా స్లో అయ్యింది. హర్రర్ మిసయ్యింది.
వారధి.కామ్ (waaradhi.com)- 2.5/5

Thursday, 5 November 2015

ఏపీ సర్కార్ కు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు



ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సీఆర్‌డీఏకు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండానే అమరావతి శంకుస్థాపన ఏలా చేస్తారని ట్రిబ్యునల్ ప్రశ్నించింది. అనుమతులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. దీనిపై స్పందించిన గ్రీన్ ట్రిబ్యునల్ 24 గంటల్లో అనుమతి పత్రాలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. ఇదివరకు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల్ని ఉల్లంఘించినందుకు వారంలోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

More

వొడాఫోన్ దీపావళి ఆఫర్



దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని తమ వినియోగదారులకు ఉచిత ఇంటర్నెట్ డేటాను అందిస్తున్నట్లు వొడాఫోన్ ప్రకటించింది. నవంబర్ 11న 100 ఎంబీ డేటాను ఉచితంగా వినియోగించుకోవచ్చు.

దీనికి చేయాల్సిందల్లా వొడాఫోన్ వినియోగదారులు DIWALI అని టైప్ చేసి 199 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపితే చాలని, ఈ ఉచిత డేటాను వినియోగించుకోవచ్చని కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
More

Wednesday, 4 November 2015

బయటకొచ్చి క దొరికారు



http://waaradhi.com/telugu/asif-bhatia-and-ganesh-arrested-in-bangalore-airport.html
బంగారు బిస్కెట్‌లు అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని కెంపేగౌడ ఎయిర్‌పోర్టు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో గుజరాత్‌కు చెందిన ఆసీఫ్ భాటియా, జి.గణేశ్ ఉన్నారు. వీరు బంగారు బిస్కట్లను ఎయిర్‌పోర్టులో చెకింగ్ అధికారుల కళ్లగప్పి బయటకు తీసుకువచ్చారు. అనంతరం ఎయిర్‌పోర్టు బయట వీరిద్దరూ పరస్పరం తిట్టుకుంటూ ఘర్షణ పడుతుండడంతో పోలీసులు అనుమానంతో వీరిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది.
బెంగళూరులో బంగారానికి ధర ఎక్కువగా ఉందని తెలుసుకున్న ఆసీఫ్ భాటియా రూ. 54 లక్షలు విలువ చేసే బంగారు బిస్కట్లను జి.గణేష్‌కు ఇచ్చి వీటిని సురక్షితంగా బెంగళూరుకు చేరిస్తే రూ. 15 వేలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. అనుకున్నట్టుగానే బంగారాన్ని గణేష్ ఎయిర్‌పోర్టు దాటించాడు.
తనకు ఇస్తానన్న రూ. 15 వేలు ఇస్తే బంగారు బిస్కట్లు ఇస్తానని గణేష్ తేల్చి చెప్పడంతో, ప్రస్తుతం తన వద్ద అంత డబ్బు లేదని, బంగారు బిస్కట్లు ఇస్తే డబ్బు తర్వాత ఇస్తానని నమ్మబలికాడు. ఇందుకు గణేష్ అంగీకరించలేదు. దీంతో ఇద్దరూ ఘర్షణ పడి పోలీసులకు చిక్కారు. ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి రెండు బంగారు బిస్కట్లను స్వాధీనం చేసుకున్నారు.
http://waaradhi.com/telugu/asif-bhatia-and-ganesh-arrested-in-bangalore-airport.htmlhttp://waaradhi.com/telugu/asif-bhatia-and-ganesh-arrested-in-bangalore-airport.html